Men_Drown_in_Pond_aa128ebc30_V_jpg--625x351-4g
7TV Focus News

అంత్యక్రియలకు హాజరై.. చెరువులో స్నానానికి వెళ్లి.. ఇద్దరి మృతి

సంగారెడ్డి 7tv focus : జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిన్నారం మండలం వావిలాల గ్రామంలో చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన గణేష్ (30), మునిరాజు (58) ప్రాణాలు కోల్పోయారు. అంత్యక్రియలు పూర్తయిన అనంతరం ఇద్దరూ చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో గణేష్‌కు ఒక్కసారిగా మూర్ఛ రావడంతో అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. చెరువులో మునిగిపోతున్న గణేష్‌ను గమనించిన మునిరాజు.. కాపాడేందుకు వెంటనే నీటిలోకి వెళ్లాడు. అయితే గణేష్‌ను రక్షించే ప్రయత్నంలో మునిరాజు కూడా నీటిలో మునిగిపోయాడు.
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article