sing_V_gif--816x480-4g
7TV Focus News

అందుకే తెలంగాణ బీజేపీ నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్టారు..

7TV FOCUS : తెలంగాణ బీజేపీలో ప్రతిసారి గ్రూప్ రాజకీయాలు, ఢిల్లీకి ఫిర్యాదులు చేయడం చేస్తారు. అందుకే బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు చోటు దక్కలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నాయకులు మారాలి అని హిత‌వు ప‌లికారు. కాగా, తెలంగాణ బీజేపీకి అధిష్ఠానం షాక్‌ ఇచ్చింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తాజాగా సోమవారం ప్రకటించిన కమిటీలో తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటుదక్కలేదు. అసలే కొన్నేండ్లుగా రాష్ట్రంలో బీజేపీ పనితీరు అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో, దూకుడుగా ప్రతిపక్ష పాత్రను పోషించాల్సింది పోయి.. అధికార కాంగ్రెస్‌తో అంటకాగడం ఢిల్లీ అధిష్ఠానానికి కోపం తెప్పించినట్టున్నది.
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article