Oxygen-Cylinder-Explodes_V_jpg--816x480-4g
7TV Focus News

అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్‌ సిలిండర్‌.. 

7tv focus : ఒక రోగిని అంబులెన్స్‌లో మరో ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అందులోని ఆక్సిజన్‌ సిలిండర్‌ను ఆన్‌ చేయగా అది పేలింది. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటనలో ఆ రోగి సజీవదహనం కాగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉదాల మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక రోగిని మరో ఆసుపత్రికి డాక్టర్లు రిఫర్‌ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 8.45 గంటల సమయంలో ఆ రోగిని ప్రైవేట్‌ అంబులెన్స్‌లో తరలించేందుకు సిద్ధమయ్యారు.కాగా, ఆ అంబులెన్స్‌లోని ఆక్సిజన్ సిలిండర్‌ను ఆన్ చేయగానే అది పేలింది. ఈ పేలుడు కారణంగా అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి. ఆ వాహనంలో ఉన్న రోగి...
⏱ Top Story 👁 22 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article