images (8)
7TV Focus News

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు..

అమలాపురం 7tv focus : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10:30 గంటలకు కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇరుసుమండకు చేరుకోనున్నారు. అనంతరం మాచవరం గ్రామం జయంతినగర్‌కి చేరుకుని.. 10.55 గంటల నుంచి 11.35 గంటల వరకు రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు.అనంతరం 11:40 గంటలకు పండువారిపేట గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:55 గంటల వరకు అక్కడ జరిగే గ్రామసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అర్హులైన రైతులు, లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలను చంద్రబాబు పంపిణీ చేయనున్నారు.
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article