Gas-refilling_V_jpg--816x480-3g
7TV Focus News

అక్ర‌మంగా వంట గ్యాస్ రీఫిల్లింగ్‌..

 7tv focus : నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా, అక్ర‌మంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వారిపై పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.. ఇప్ప‌టికే ప‌లు చోట్ల గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాల‌పై దాడులు చేప‌ట్టారు. తాజాగా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్ర‌మ గ్యాస్ రీఫిల్లింగ్‌కు పాల్ప‌డుతున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దుండిగ‌ల్ పీఎస్ ప‌రిధిలోని బౌరంపేట , అయ్యప్ప స్వామి టెంపుల్‌లో వంట గ్యాస్ రీఫిలింగ్ పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసులు వారి వ‌ద్ద నుంచి 81 వంటగ్యాస్ (హెచ్‌పీ) సిలిండర్లు, 3 టాటా ఏస్ వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ముగ్గురిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.
⏱ Top Story 👁 14 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article