అక్రమ పొగాకు రవాణాపై విజిలెన్స్ కొరడా
జంగారెడ్డిగూడెం, జూలై 7 (7టీవీ ఫోకస్): జంగారెడ్డిగూడెం నుంచి గుంటూరుకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న హైగ్రేడ్ పొగాకు బేళ్లను పొగాకు బోర్డు విజిలెన్స్ అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో నిఘా ఏర్పాటు చేసిన అధికారులు కలపర్రు టోల్‌ప్లాజా వద్ద రెండు ఆటోలను తనిఖీ చేసి సుమారు 32 హైగ్రేడ్ పొగాకు బేళ్లను గుర్తించి సీజ్ చేశారు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. పొగాకు బోర్డు విజిలెన్స్ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం నుంచి గుంటూరుకు అక్రమంగా పొగాకు తరలిస్తున్నట్లు గుర్తించి అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు ఆటోలను కలపర్రు టోల్‌ప్లాజా...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads