అజిత్ అగార్కర్ అవుట్? ఛీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు ..!
7tv focus : బీసీసీఐ ఛీఫ్ సెలెక్టర్ గా ఉన్న అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ నెలతో ముగియబోతోంది. ఇప్పటికే ఏడాది పొడిగింపు తీసుకున్న ఆయనకు మరోసారి పొడిగింపు ఇచ్చే ఉద్దేశంలో బీసీసీఐ లేదని ఎన్డీటీవీకి బోర్డు వర్గాలు తెలిపాయి. దీంతో అగార్కర్ స్ధానంలో కొత్త ఛీఫ్ సెలెక్టర్ గా భారత జట్టు మాజీలు, ముంబై ఐపీఎల్ టీమ్ మాజీ క్రికెటర్లు కూడా అయిన ప్రజ్ఢాన్ ఓజా, పార్దివ్ పటేల్ పేర్లను బోర్డు పరిశీలిస్తోంది. రేపు జరగనున్న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం నేపథ్యంలో, అగార్కర్‌కు పదవీకాలం పొడిగింపు లభించే అవకాశాలు దాదాపు లేవు. నిన్న వెస్టిండీస్ వన్డే సిరీస్ కోసం జరిగిన సెలెక్టర్ల సమావేశమే అగార్కర్ కు చివరిది కావచ్చని భావిస్తున్నారు....
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads