అతి తీవ్ర తుపానుగా ‘అర్నబ్’ – ఇవాళ, రేపు భారీ వర్షాలు, ఈదురుగాలులు
రాష్ట్రంపైకి అర్నబ్ తుపాను కొనసాగుతోంది. ఇది అతి తీవ్ర తుపానుగా మారింది. ఒక రోజంతా అలాగే కొనసాగనుండడంతో నష్టం భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో భారీ గాలులు వీస్తాయని, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అలానే 53 రైళ్లను దక్షిణ కోస్తా రైల్వే రద్దు చేసింది. అర్నబ్ తీరానికి దగ్గరయ్యే కొద్ది తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది అతి తీవ్ర తుపానుగా తీరం దాటనుండడంతో భారీ గాలుల ముప్పుతో పాటు తీర ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు....
⏱ Top Story
👁 17 Views |
⬇️ 0 Downloads