అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
7tv focus : ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భవిష్యత్తు అవసరాల కోసం ఆదా చేయాలని ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచేలా మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది.మాగనూరు మండల కేంద్రంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ పగిలి మూడు రోజులైనా సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో విలువైన తాగునీరు వృథాగా పారుతూ చెరువును తలపిస్తోంది. పైప్‌లైన్ నుంచి బయటకు వస్తున్న నీరు పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున నిలిచిపోవడంతో నీటి వనరులు వృథా కావడమే కాకుండా పరిసర ప్రాంతాలు చిత్తడిగా మారుతున్నాయి.ఒకవైపు మాగనూరు కృష్ణ మండల పరిధిలోని ఎనిమిది గ్రామాల ప్రజలు మిషన్ భగీరథ ద్వారా సక్రమంగా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు పైప్‌లైన్...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads