Rail-track-Ananthapur_V_gif--816x480-3g
7TV Focus News

అనంత‌పురం జిల్లాలో విషాదం.. రైలు కింద‌ప‌డి త‌ల్లి, ఇద్ద‌రు కుమార్తెలు ఆత్మ‌హ‌త్య‌..!

7tv focus : అనంతపురం జిల్లాలో విషాద ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. రైలు కిందపడి తల్లీ, ఇద్ద‌రు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. యాడికి మండలం రాయలచెరువు-వేములపాడు గ్రామాల రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో తల్లి, ఒక‌ కుమార్తె అక్కడిక్కడే మృతిచెందారు. మరో కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని రాయలచెరువు ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు.ప్రథమ చికిత్స అనతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప‌ట్ట‌ణానికి తరలిస్తుండగా ఆ చిన్నారి కూడా మ‌ర‌ణించింది. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టానికి త‌ర‌లించారు.
⏱ Top Story 👁 14 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article