అనసూయపై పోలీసులకు ఫిర్యాదు..
7tv focus : యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందూ మతానికి సంబంధించిన అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనసూయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. ఇటీవల సోషల్ మీడియాలో అనసూయ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ‘జై శ్రీరామ్’ పేరుతో కొందరు దాడులకు పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మతపరమైన అంశాలపై మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, ఇలాంటి వ్యాఖ్యలతో ఇతరుల మనోభావాలను దెబ్బతీయవద్దని వారు సూచించారు.అయితే ఈ వివాదంపై అనసూయ వెనక్కి తగ్గినట్లు కనిపించడం...
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads