అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
7tv focus : జిల్లాలో సర్ ప్రక్రియ కొనసాగుతుండగా, అనుమతి లేకుండా గైర్హాజరు అయిన బోధన్, రుద్రూర్ మండలం తహసీల్దార్ బి.తారాబాయిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెన్షన్‌చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయినందుకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.సర్ ప్రక్రియ కొనసాగుతుండగా ఎన్నికల కమిషన్ విధుల్లో ఉన్న ఈఆర్వోలు, బీ ఎల్ఓలు, సూపర్‌వైజర్లను బదిలీ చేయవద్దని, సుదీర్ఘ సెలవులు మంజూరు చేయవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లోనూ భారత ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి ఉండగా తహసీల్దార్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు.
⏱ Top Story
👁 16 Views |
⬇️ 0 Downloads