అన్నదమ్ముల మధ్య కత్తులతో దాడులు.. అన్న కుమారుడి తలకు తీవ్రగాయం!
7tv focus : ఇంటి బాట వద్ద మొదలైన చిన్నపాటి వివాదం అన్నదమ్ముల మధ్య కత్తులు, కర్రలతో దాడులకు దారితీసింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరికి చేయి విరగ్గా.. మరొకరికి తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.స్థానిక ఎస్సై మసిరెడ్డి మహేందర్, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. అడవి రంగాపురం గ్రామానికి చెందిన బుడిమె శ్రీనివాస్, రవీందర్ అన్నదమ్ములు. శనివారం ఉదయం ఇంటి బాట వద్ద వీరి మధ్య వివాదం తలెత్తింది. మాటామాటా పెరగడంతో ఇరువర్గాలు కత్తులు, కర్రలతో పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనలో తమ్ముడు శ్రీనివాస్ చేయి విరిగింది. అనంతరం శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తిరిగి...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads