అన్నయ్యే ‘నా ఏకైక హీరో’.. పవన్ కల్యాణ్
అమరావతి 7tv focus : అన్నయ్య చిరంజీవి గురించి తలుచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అన్నయ్యకు తమ్ముడు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేకమైన రోజున పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నప్పుడు, కొన్ని మధురమైన సంఘటనలు గుర్తొచ్చాయని అన్నారు. కాలేజీ విద్యార్థిగానే ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత గొప్ప వ్యక్తితో నడుస్తున్నట్లు అనిపించేదన్నారు. ఆయన తన పొడవైన ఉంగరాల జుట్టు, దృఢమైన NCC క్యాడెట్ శరీరాకృతి, బెల్-బాటమ్ ప్యాంట్, కళ్లద్దాల పెట్టుకుని నాన్న బుల్లెట్(350 cc) బైక్ నడుపుతుంటే... అబ్బా! ఆ దృశ్యం ఒక అభిమానిగా ఆయనను ఆరాధించేలా చేసే అద్భుతమైన క్షణమని చెప్పుకొచ్చారు.‘సినిమా హీరో కాకముందే, మా...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads