అపహరణకు గురైన బాలుడు జీడిమెట్లలో క్షేమంగా లభ్యం
12 రోజుల తర్వాత పోలీసులకు అప్పగించిన నిందితుడు.. అసలు ఉద్దేశంపై దర్యాప్తు 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 2: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గత నెల 20న అపహరణకు గురైన ఐదేళ్ల బాలుడు నిఖిల్ 12 రోజుల తర్వాత జీడిమెట్లలో క్షేమంగా లభ్యమయ్యాడు. బాలుడిని అపహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ మహబూబ్ అలీ (40) గురువారం స్వయంగా బాలుడిని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించడంతో కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్‌కు చెందిన షేక్ మహబూబ్ అలీ గత నెల 20న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అమ్మమ్మతో కలిసి నిద్రిస్తున్న నిఖిల్‌ను వెంట తీసుకెళ్లాడు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదుకావడంతో రైల్వే పోలీసులు అపహరణ...
⏱ Top Story
👁 102 Views |
⬇️ 0 Downloads