అభివృద్ధి పనులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: సురేష్ రెడ్డి
కుత్బుల్లాపూర్, జూలై 8 (7 టీవీ ఫోకస్): దూలపల్లి–జీడిమెట్ల ఇండస్ట్రియల్ రోడ్డు అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చొరవతోనే మంజూరైందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను కాంగ్రెస్ నాయకులు తమ ఘనతగా చెప్పుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు.కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇటీవల దూలపల్లి–జీడిమెట్ల ఇండస్ట్రియల్ రోడ్డు వద్ద చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రత్యేక చొరవతో దూలపల్లి–జీడిమెట్ల ఇండస్ట్రియల్ రోడ్డు మంజూరైందన్నారు....
⏱ Top Story
👁 32 Views |
⬇️ 0 Downloads