amaravati_kvantam_vally_009b4708eb_V_jpg--625x351-4g
7TV Focus News

అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు

అమరావతి 7tv focus : ఏపీ రాజధాని అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు పడింది. ఎస్‌బీఐ హౌసింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి SBI-APCRDA మధ్య భూ అగ్రిమెంట్ పూర్తైంది. ఐనవోలులో మొత్తం 2.05 ఎకరాల్లో SBI నివాస సముదాయాన్ని నిర్మించనున్నారు. దాదాపు రూ.214 కోట్లతో SBI హౌసింగ్ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. 4.46 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో నిర్మాణం జరుగనుంది. జూన్, 2027లో ‌నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి. 2028లోపు నివాస సముదాయం పూర్తి చేయడమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు.
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article