అమరావతి రైతులను రాజకీయాలకు వాడుకోవద్దు: మంత్రి అచ్చెన్నాయుడు
7టీవీ ఫోకస్, అమరావతి, జూన్ 27: అమరావతి రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించే వారి కుట్రలు ఇక సాగవని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాజధాని అంశంలో రైతులను మోసం చేసిన వారే ఇప్పుడు వారి పేరుతో రాజకీయాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని అంశంపై రాష్ట్ర ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించిన వైసీపీ నాయకులు ఇప్పుడు మళ్లీ రైతుల పేరుతో రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఐదేళ్లపాటు అమరావతి అభివృద్ధిని అడ్డుకుని, రాజధాని ప్రాంత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన వారే ఇప్పుడు రైతుల సంక్షేమం పేరుతో పర్యటనలు చేపట్టడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. అమరావతి రైతుల...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads