అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి..
హైదరాబాద్ 7tv focus : అమెరికాలో తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పెళ్లైన 17 రోజులకే మృతిచెందడం సంచలనంగా మారింది. మసాచుసెట్స్‌లోని లోవెల్‌లో హైదరాబాద్‌కు చెందిన సివిల్ ఇంజినీర్ మహమ్మద్ జాబెర్ హుస్సేన్(28) నివసిస్తున్నాడు. సెప్టెంబర్ 14న కుటుంబ సభ్యులతో చివరిసారిగా అతను ఫోన్‌లో మాట్లాడాడు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే జాబెర్ తన గదిలో నిద్రలోనే మృతిచెందినట్లు అతని రూమ్‌మేట్ బాధిత కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది.అయితే, జాబెర్ మృతికి గల కచ్చితమైన కారణాలపై స్పష్టత రాలేదు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు....
⏱ Top Story
👁 19 Views |
⬇️ 0 Downloads