అరసవల్లి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్లు.. రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి
7tv focus : అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు(సోమవారం) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఇంద్ర పుష్కరిణి సందర్శించిన అనంతరం ఆలయ అధికారులు, అర్చకులతో ఆలయ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో స్వదేశీ దర్శనం 2.0 కింద అరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్లు కేటాయించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర టూరిజం మంత్రి గజేంద్ర సింగ్ షెరావత్కు శ్రీకాకుళం జిల్లా ప్రజలు తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో అరసవల్లి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని గత రెండేళ్లుగా చేసిన కృషికి ఇది ఒక మైలురాయిగా...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads