అరామ్‌కో చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి..
7tv focus : సౌదీ అరేబియాలోని జజాన్‌లో ఉన్న అరామ్‌కో చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు. ఈ దాడికి తామే కారణమని హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యా సరీతెలిపారు. తమ గగనతలంలో సౌదీ డ్రోన్ల చొరబాటుకు ప్రతిస్పందనగానే దాడి చేసినట్లు వెల్లడించారు.సౌదీ ‘మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ’ కూడా ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగినట్లు ధ్రువీకరించింది. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. ఓ వైపు అమెరికా-ఇరాన్ ఘర్షణలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసింది.
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads