‘అర్నబ్’ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది: హోంమంత్రి అనిత
రాష్ట్ర వ్యాప్తంగా అర్నబ్ హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అతి తీవ్రతుపాను 'అర్నబ్’ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు. విపత్తు నిర్వహణకు సంబంధించిన శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు: ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ బృందాలు 24 గంటలూ అందుబాటులో ఉండాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలను అవసరమైనప్పుడు వెంటనే తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు....
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads