అర్నబ్ తుపాను ఎఫెక్ట్: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రైళ్లు, విమానాల రద్దు
అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో జనజీవనంపై ప్రభావం పడుతోంది. తెలంగాణలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుపాను కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడ, విశాఖపట్నం వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. తుపాను పరిస్థితుల కారణంగానే విమానాలను రద్దు చేసినట్లు జీఎంఆర్ వర్గాలు ప్రకటించాయి. ఈ పరిస్థితి...
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads