kcr-3_V_jpg--816x480-4g
7TV Focus News

అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం

7tv focus : మాతృవియోగంతో శోకంలో ఉన్న అల్లం నారాయణ సోదరులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ సాహిత్యం, జర్నలిజం రంగాల్లో ప్రముఖులైన అల్లం రాజయ్య, అల్లం వీరయ్య, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, సీనియర్ సంపాదకుడు, తెలంగాణ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు అల్లం నారాయణల మాతృమూర్తి అల్లం బుచ్చవ్వ మరణం పట్ల సంతాపం ప్రకటించారు.సాహిత్య, జర్నలిజం రంగాల్లో తమదైన ముద్ర వేసి, రాష్ట్ర సాధన ఉద్యమంలో తమవంతు పాత్ర పోషించిన ముగ్గురు కుమారులను తెలంగాణకు అందించిన మాతృమూర్తి అల్లం బుచ్చవ్వని తెలిపారు. తల్లిని కోల్పోయి శోకతప్త హృదయులైన అల్లం సోదరులకు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article