Untitled_3_df95d004ec_V_jpg--625x351-4g
7TV Focus News

అశోక్‌రెడ్డి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. వ్యాపార భాగస్వామే సూత్రధారి

 7tv focus : నగరంలోని గాజులరామారం నివాసియైన వ్యాపారి అశోక్‌రెడ్డి కిడ్నాప్ కేసులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఆయన వ్యాపార భాగస్వామి అయిన చంద్రశేఖర్ ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. అశోక్ రెడ్డి, ఆయన స్నేహితుడు చంద్రశేఖర్ మూడేళ్లుగా వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. అయితే.. కొన్ని కారణాల వల్ల వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. చంద్రశేఖర్ తప్పుడు లెక్కలు చూపించి.. తనను మోసం చేశాడని గ్రహించిన అశోక్‌రెడ్డి చంద్రశేఖర్‌ను నిలదీశారు. దీనితో కక్ష పెట్టుకున్న చంద్రశేఖర్.. అశోక్‌ రెడ్డిని సుఫారీ గ్యాంగ్‌‌తో కిడ్నాప్ చేయించాడు. అనంతరం జడ్చర్ల అడవిలోకి తీసుకెళ్లి.. బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు. తిరిగి గచ్చిబౌలిలో వదిలేసి...
⏱ Top Story 👁 14 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article