cjp_fa1aee8b39_V_jpg--625x351-4g
7TV Focus News

ఆగస్టు 5న సీజేపీ కీలక సమావేశం..

నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశంపై ఆందోళనలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సీజేపీ (CJP) సంస్థ ఆగస్టు 5న కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో వ్యవస్థాపకుడు అభిజిత్ నివాసంలో కోర్ కమిటీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది (CJP meeting). గత నెల రోజులుగా చేపట్టిన ఉద్యమంపై సమీక్షతో పాటు, ఇకపై అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయాలను కూడా ఈ సమావేశంలో తీసుకోనున్నారు. రాష్ట్రాల వారీగా విద్యార్థులు, వాలంటీర్లు, కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సూచనలను కూడా కోర్ కమిటీ చర్చించనుంది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. తదుపరి దశలో చేపట్టే ఉద్యమాలు, కార్యక్రమాలపై కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది
⏱ Top Story 👁 51 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article