ఆజమ్ ఖాన్ ట్రస్టు, యూనివర్సిటీల్లో ఈడీ తనిఖీలు
లక్నో focus : సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజమ్ ఖాన్‌కు చెందిన మౌలానా మొహమ్మద్ అలీ జౌహార్ ట్రస్టు, యూనివర్సిటీలో ఇవాళ ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మనీల్యాండరింగ్ కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎస్పీ నేత ఆజమ్ ఖాన్ జైలు విక్ష అనుభవిస్తున్నారు. రాంపూర్, షహరాన్‌పుర్, జామియా నగర్ ప్రాంతాల్లోని సుమారు 10 ప్రదేశాల్లో సోదాలు చేపడుతున్నారు. సీఆర్పీఎఫ్ భద్రత ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. షహరాన్‌పూర్‌లోని సీఏ ఇల్లు, రెండు కంపెనీలు, వాటి ప్రమోటర్ల ఇండ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. వీరంతా ట్రస్టుతో లింకు ఉన్నారు. ప్రైవేటు కాంట్రాక్టుల ద్వారా ప్రభుత్వ కాంట్రాక్టు నిధులను మళ్లించి, ఆ నిధులను ట్రస్టు, వర్సిటీకోసం వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లక్నోలో ఉన్న ట్రస్టు...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads