ed-raids-ali-jauhar-university-azam-khan-2026-08-19-10-41-25
7TV Focus News

ఆజమ్ ఖాన్ ట్రస్ట్, యూనివర్సిటీల్లో ఈడీ సోదాలు

7tv focus : సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం జైల్లో ఉన్న ఆజమ్ ఖాన్‌కు చెందిన మౌలానా మొహమ్మద్ అలీ జౌహార్ ట్రస్ట్, మొహమ్మద్ అలీ జౌహార్ యూనివర్సిటీ లక్ష్యంగా ఈడీ అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. పీఎంఎల్ఏ చట్టం కింద నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి లక్నో ఈడీ జోనల్ విభాగం ఈరోజు ఈ తనిఖీలను నిర్వహిస్తోంది.ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, సహారన్‌పూర్ తో పాటు ఢిల్లీలోని జమియా నగర్‌తో సహా మొత్తం 10 ప్రదేశాల్లో సీఆర్పీఎఫ్ భద్రత నడుమ ఈ దాడులు కొనసాగుతున్నాయి. 
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article