ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఐక్యతకు దోహదం: ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 29: ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు సనాతన సంస్కృతి పరిరక్షణకు దోహదపడతాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కె.పీ. వివేకానంద అన్నారు. మిథిలా నగర్‌లోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయం 9వ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహదేవపురం వార్డు-277లో, ప్రగతి నగర్ సమీపంలోని మిథిలా నగర్‌లో ఉన్న శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో సోమవారం నిర్వహించిన 9వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాల్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కె.పీ. వివేకానంద భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని, సుఖసంతోషాలతో జీవించాలని, కుత్బుల్లాపూర్...
⏱ Top Story
👁 30 Views |
⬇️ 0 Downloads