WhatsApp Image 2026-06-20 at 9.34.06 PM
7TV Focus News

ఆపదలో అండగా ‘మార్గదర్శక్’.. 41 మంది వాలంటీర్లకు రీ-సర్టిఫికేషన్

7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 20: ఆపదలో ఉన్న వ్యక్తులకు సకాలంలో మార్గనిర్దేశం, మానసిక భరోసా, అవసరమైన సహాయం అందించేందుకు రూపొందించిన ‘మార్గదర్శక్’ కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 41 మంది వాలంటీర్లకు రీ-సర్టిఫికేషన్ అందజేసి, ‘మార్గదర్శక్– యువర్ బడ్డీ ఇన్ డిస్ట్రెస్ 3.0’ పేరుతో కొత్త దశకు శ్రీకారం చుట్టారు. సమాజంలో మానసిక, సామాజిక, వ్యక్తిగత, సైబర్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న వారికి సహాయ సహకారాలు అందించేందుకు గత దశాబ్దంగా కొనసాగుతున్న మార్గదర్శక్ కార్యక్రమం విశేష సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో శిక్షణ పొందిన మార్గదర్శక్‌లు, సంగమిత్రలను ఒకే...
⏱ Top Story 👁 49 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article