singareni-3_V_jpg--816x480-3g
7TV Focus News

ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు

7tv focus : దీపావళి అంటే చీకటిని పారద్రోలే దీపాల వెలుగులు. ఇంటిల్లిపాదీ కలిసి జరుపుకునే ఆనందాల పండుగ. కానీ సింగరేణి ప్రాంతంలో దీపావళికి మరో ప్రత్యేకమైన భావోద్వేగం ఉంది. ఇక్కడ వెలిగే ప్రతి దీపం వెనుక ఓ జ్ఞాపకం. ప్రతి సమాధి వెనుక ఓ కుటుంబ కథ. ప్రతి కుటుంబం గుండెల్లో చెరిగిపోని ఓ ఆత్మీయత దాగి ఉంది. భౌతికంగా తమ మధ్య లేకపోయినా.. జ్ఞాపకాలలో ఎప్పటికీ జీవించే తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్ద దీపాలు వెలిగిస్తూ దీపావళి జరుపుకోవడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్, గౌతంపూర్, ధన్‌బాద్, రామవరం ప్రాంతాల్లో ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. దీపావళి పండుగకు...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article