WhatsApp Image 2026-06-26 at 6.17.55 PM
7TV Focus News

ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తొలగింపు సరికాదు: శ్రీనివాస్ గౌడ్

7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 26: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కల్పించిన భద్రతను తొలగించడాన్ని తప్పుబట్టారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రతను తొలగించడం సరైన నిర్ణయం కాదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సమర్థవంతమైన ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాష్ట్రపతి పురస్కారంతో పాటు పలు అవార్డులు అందుకున్నారని, గతంలో గురుకుల విద్యాసంస్థల...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article