ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
7tv focus : హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ 2026- 27 సాంస్కృతిక పోటీల్లో నుమకొండ వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల(అటానమస్) అధ్యాపకులు అద్భుతమైన కళాప్రతిభను చాటుకున్నారు. జానపద బృంద నృత్యం, సోలో గానం విభాగాల్లో ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.కళాశాలకు చెందిన అధ్యాపకులు సువర్ణ, సుభాషిణి, జ్యోతి, పద్మ, పి.అరుణ, రేణుక, మాధవి, కల్పన జానపద బృంద నృత్యాన్ని అత్యంత వైభవంగా ప్రదర్శించారు. తెలంగాణ జానపద సంస్కృతి, సంప్రదాయాల సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ, సమన్వయం, లయబద్ధత, నృత్య విన్యాసాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణ, జానపద కళా వైభవం వారి ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads