ఆసుపత్రి భవన పనులు వేగవంతం చేయాలి
చింతలపూడి, జూలై 7 (7టీవీ ఫోకస్): చింతలపూడిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య మౌలిక వసతుల పనులను వేగవంతం చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఏరియా ఆసుపత్రి భవనం, అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను పట్టణ నాయకులతో కలిసి పరిశీలించిన ఆయన పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి భవనంలో జరుగుతున్న ఫ్లోరింగ్ టైల్స్ పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఏరియా ఆసుపత్రి, అర్బన్ హెల్త్ సెంటర్ భవనాలను వీలైనంత త్వరగా పూర్తి...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 1 Downloads