ఇంటర్ కాలేజీలకు ఫైర్ NOC తప్పనిసరి
హైదరాబాద్ 7tv : ఇంటర్మీడియట్ కాలేజీలకు ఫైర్ NOC కంపల్సరీ చేశామని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డుకు వచ్చిన కొన్ని ఫైర్ NOCలను హైడ్రాతో సంప్రదించి పరిశీలించగా, కొన్ని సర్టిఫికెట్లు బోగస్‌గా ఉన్నట్లు గుర్తించామన్నారు. హైడ్రాకు వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇంటర్మీడియట్ బోర్డుకు అందడంతో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఫేక్ NOCల వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయిన తర్వాత ఎన్ని నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారనే విషయం స్పష్టమవుతుందని తెలిపారు.
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads