ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
7tv focus : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మువిజయవాడలోని ఇంద్రకీలాద్రి కి చేరుకున్నారు. బుధవారం రాత్రి 7 గంటలకు ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, విజయవాడ దుర్గమ్మ ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ తదితరులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో ముర్మూకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనంతరం పట్టువస్త్రాలు, శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటాన్ని రాష్ట్రపతికి అందజేశారు.
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads