ఈటల రాజేందర్ పాదయాత్రకు బ్రేక్.. అనుమతి నిరాకరించిన పోలీసులు
మల్కాజ్‌గిరి ఎంపీ, భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ తలపెట్టిన "మహా పాదయాత్ర"కు పోలీసులు అనుమతి నిరాకరించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను తరలించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈరోజు ఉదయం ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్ నుంచి నాలుగు రోజుల పాటు ఈ పాదయాత్ర జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈటల రాజేందర్ ఉదయాన్నే ఏదులాబాద్ చేరుకుని, స్థానిక రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 5,000 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి యాత్రను ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా, పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసుల చర్యపై...
⏱ Top Story
👁 20 Views |
⬇️ 0 Downloads