ఉట్కూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఘనంగా పొల్లమ్మ అవ్వ బోనాల పండుగ
ఉట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గ్రామదేవత పొల్లమ్మ అవ్వ బోనాల పండుగను గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.గ్రామ సర్పంచ్ ఆర్. నర్సిములు మాట్లాడుతూ, గ్రామదేవత పొల్లమ్మ అవ్వ ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, రైతులు పండించిన పంటలు పుష్కలంగా పండాలని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు ఐకమత్యంతో, భక్తి భావంతో పండుగలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads