‘ఉత్పత్తి–ఉత్పాదకతతో పాటు కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలి’
రుద్రంపూర్, ఆగస్టు 037tv : కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరమణను గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించిన నాయకులు, నూతన బాధ్యతల్లో ఆయన విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం అనే రెండు లక్ష్యాలను సమన్వయం చేస్తూ తమ సంఘం దశాబ్దాలుగా నిరంతరం పోరాటాలు చేస్తూ, యాజమాన్యంతో సానుకూల చర్చలు నిర్వహిస్తూ అనేక సమస్యలకు పరిష్కారాలు సాధించిందన్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుతో పాటు కార్మికుల సంక్షేమం, భద్రత, ఆరోగ్యం, సంక్షేమ పథకాల అమలుకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని...
⏱ Top Story
👁 13 Views |
⬇️ 0 Downloads