bhadradri-kothagudem_V_jpg--816x480-4g
7TV Focus News

ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు..

7tv focus : మురసు తుఫాన్‌ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు జలమయమవ్వగా.. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి.పాల్వంచ నుంచి మాదారం మీదుగా అన్నపురెడ్డిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై సత్యంపేట గ్రామం వద్ద పాములేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి వరద నీరు పొంగిపొర్లుతుండటంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పాల్వంచ నుంచి దమ్మపేట వెళ్లే ప్రధాన రహదారిపై రాజుపేట శివారులో పాములేరు వాగుపై ఇటీవల కూలిన వంతెన పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక అప్రోచ్‌ కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article