ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు
7tv focus : తెలంగాణలో నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జేఏసీ ప్రెసిడెంట్ డా. మహేందర్ రావు, అధికార ప్రతినిధి డా. బోడ శ్రీనివాస్, హనుమకొండ జిల్లా బాధ్యులు వినయ్ కుమార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జేఏసీ బాధ్యులు కుమార్ హైదరాబాద్‌లోని నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. సందర్భంగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జేఏసీ బాధ్యులు కేటీఆర్ దృష్టికి వారి సమస్యలు, డిమాండ్లను తీసుకెళ్లారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads