ఎల్‌నినో ప్రభావంతో అన్ని ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం: మంత్రి పొంగులేటి
సంగారెడ్డి జిల్లా, అక్టోబరు 27): ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో అన్ని ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డివ్యాఖ్యానించారు. రైతులు చాలా అనుభవజ్ఞులని.. ఈ కరువుపై దృష్టి పెట్టి రెండో పంటను వేయొద్దని కోరారు. ప్రతిపక్షాలు కూడా ఉన్న వాస్తవాన్ని అన్నదాతలకు చెబితే బాగుంటుందని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) సంగారెడ్డిలో మంత్రులు పొంగులేటి, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలోని జడ్పీ హాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఎంపీ రఘునందన్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. ధరణిని బంగాళాఖాతంలో...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads