WhatsApp Image 2026-06-29 at 2.13.31 PM
7TV Focus News

ఎస్‌ఐఆర్ ఓటరు సవరణ ప్రక్రియను పరిశీలించిన కూన శ్రీనివాస్ గౌడ్

7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 29: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో బూత్ లెవల్ అధికారులు నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని సోమవారం మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొని బీఎల్‌వోలు అందజేసే ఎన్యుమరేషన్ ఫారంలో తమ పూర్తి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని...
⏱ Top Story 👁 20 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article