ఎస్‌ఐఆర్ విజయానికి అందరూ సహకరించాలి
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 9: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని, బీఎల్‌వోలకు స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని బీఆర్‌ఎస్ సూరారం డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129వ సూరారం డివిజన్ పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా నెహ్రూనగర్, మార్కండేయనగర్ ప్రాంతాల్లో బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలో పేర్ల నమోదు, చిరునామా మార్పు, వివరాల సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు....
⏱ Top Story
👁 13 Views |
⬇️ 0 Downloads