images (6)
7TV Focus News

 ఏకాంతంగా గడిపేందుకు అడవికి వెళ్లిన జంట‌.. విద్యుత్ షాక్‌తో తీవ్ర గాయాలు

7tv focus : వాళ్లిద్ద‌రు ఏకాంతంగా గ‌డిపేందుకు స‌మీపంలోని అడ‌విలోకి వెళ్లారు. ఈ క్ర‌మంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ విషాద‌క‌ర సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఫయాజ్ అనే యువకుడు ఓ యువతితో ఏకాంతంగా గడిపేందుకు అడ‌వికి వెళ్లారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగి వారి మీద ప‌డ్డాయి. యువతి కేకలు విన్న గొర్రెల కాప‌రులు పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చిన గొర్రెల కాపరులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. Geographic Reference
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article