ఏపీకి మరో తుపాను ముప్పు..
7tv focus : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉన్నది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది రేపు (ఆదివారం) సాయంత్రానికి తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం.. సోమవారం సాయంత్రానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీ అంతటా విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు...
⏱ Top Story
👁 2 Views |
⬇️ 0 Downloads