Election-official-died (1)
7TV Focus News

ఏపీలో గుండెపోటుతో ఎన్నిక‌ల అధికారిణి దుర్మ‌ర‌ణం..!

7tv focus : అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకుంటలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధులు నిర్వ‌హిస్తున్న ఓ అధికారిణి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఏపీవోగా విధులు నిర్వహిస్తున్న హరిత గౌడ్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన సహచర సిబ్బంది, పోలీసులు ఆమెను కూడేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. హరిత గౌడ్‌ రాయదుర్గంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పిట్లంపల్లి గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం 3లో గందరగోళం చోటుచేసుకుంది. దాంతో అధికారులు సుమారు గంటసేపు పోలింగ్‌ను నిలిపివేశారు. ఓటువేసే సమయంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకేసారి పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఎన్నికల సిబ్బంది భయాందోళనకు...
⏱ Top Story 👁 18 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article