ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన
7tv focus : ఏపీలో దాడులు,దౌర్జన్యాలు, అక్రమాలతో జంగిల్ రాజ్ పాలనకొనసాగుతోందని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడుదల రజినిఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి వైసీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం దాడులు మొదలయ్యాయని వెల్లడించారు.నారా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విధ్వంసమైందని, ఏపీని బిహార్‌లా మార్చారని దుయ్యబట్టారు. పోలీసుల అండదండలతో టీడీపీ మూకలు దాడులు చేస్తున్నారని, నామినేషన్ కేంద్రాల్లో అధికారుల సాక్షిగా బి ఫారాలు చించేశారని విమర్శించారు.
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads