ఐడీబీఐ ప్రైవేటీకరణపై రాహుల్ విమర్శలకు ఆర్థికమంత్రి నిర్మలా స్ట్రాంగ్ కౌంటర్
7tv focus : ఐడీబీఐ బ్యాంక్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్రం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఉద్యోగులతో పాటు, దేశం నష్టపోతుందన్న రాహుల్ విమర్శలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులు నిర్వీర్యమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల అండతోనే కింగ్‌ఫిషర్, వీడియోకాన్, ఏబీజీ షిప్‌యార్డ్‌లకు వేల కోట్ల రుణాలు మంజూరయ్యాయని ఆమె తీవ్రంగా విమర్శించారు.నాడు పలుకుబడి ఉన్నవారికి ‘ఫోన్‌బుక్’.. సామాన్యులకు ‘రూల్‌బుక్’ ఉండేవని ఆర్థికమంత్రి ఎద్దేవా చేశారు. 1957 ముంద్రా స్కామ్ నుంచి యూపీఏ హయాం వరకు బ్యాంకుల్లో రాజకీయ జోక్యాన్ని ఆమె ప్రస్తావించారు. సంజయ్ గాంధీ సన్నిహితులకు రుణాలు ఇవ్వనందుకే 1976లో నాటి ఎస్‌బీఐ చైర్మన్...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads