Man-Attacks-Delhi-Cops-With_V_jpg--816x480-3g
7TV Focus News

 ఐదుగురు పోలీసులపై కత్తితో దాడి చేసిన వ్యక్తి..

7tv focus : విచారణ కోసం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చిన వ్యక్తి కత్తితో పోలీసులపై దాడి చేశాడు. ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. పారిపోయిన ఆ వ్యక్తి పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డాడు.దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల నబీల్‌ అనే వ్యక్తి తన తల్లిని, సోదరిని వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సోమవారం మధ్యాహ్నం పోలీసులు విచారణ కోసం జామా మసీదు పోలీస్ స్టేషన్‌కు అతడిని తీసుకువచ్చారు.కాగా, నబీల్‌ను ప్రశ్నిస్తుండగా అకస్మాత్తుగా కత్తి తీసి పోలీసులపై దాడి చేశాడు. ఆ తర్వాత ఒక బైక్‌ చోరీ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అతడి దాడిలో ఐదుగురు పోలీసులకు మెడ, ముఖం భాగాల్లో...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article